AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

12న కాంగ్రెస్‌లో షర్మిల చేరిక!

సోనియా సమక్షంలో పార్టీ విలీనం
ముహూర్తం ఖరారు

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ఈ నెల 12న కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు సమాచారం. ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనాయకులు సోనియాగాంధీ సమక్షంలో పార్టీని విలీనం చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు సంబంధించి చర్చలన్నీ పూర్తయ్యాయని తెలుస్తోంది.

విలీనం తర్వాత ఇక వైఎస్‌ఆర్‌టీపీ ఉండదు. అందువల్ల షర్మిల.. కాంగ్రెస్‌ తరపున ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని తెలిసింది. ఇందుకు సంబంధించి బెంగళూరులో జరిగిన చర్చలు ఫలవంతం అయ్యాయని టాక్‌.

నిజానికి గత నెలలోనే ఈ పార్టీ విలీనం జరగాల్సి ఉంది. అప్పట్లో జులై 18న ప్రతిపక్ష పార్టీల సమావేశం జరిగింది. అప్పుడే ఈ విలీన ప్రక్రియపై చర్చలు జరిగాయన అంటున్నారు. మొన్ననే రాహుల్‌ గాంధీ కూడా.. తిరిగి లోక్‌సభకు రావడంతో.. ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్‌.. షర్మిల పార్టీని విలీనం చేసుకోవడానికి ఇదే సరైన తరుణం అని భావించినట్లు సమాచారం. ఈ విలీన ప్రక్రియతో.. తెలంగాణలో కాంగ్రెస్‌కి మరింత ఊపు వస్తుందనీ.. తద్వారా మరిన్ని చేరికలను త్వరలో చూస్తామని కాంగ్రెస్‌పార్టీ పెద్దలు చెబుతున్నారు.

ANN TOP 10