AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సూర్య ధనాధన్‌ ఇన్నింగ్స్‌.. మూడో టీ20లో టీమిండియా ఘనవిజయం..

టీ20 వరల్డ్‌ నంబర్‌ వన్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ మళ్లీ చెలరేగాడు. తనదైన ట్రేడ్‌మార్క్‌ షాట్లతో అలరించాడు. దీంతో విండీస్‌తో జరిగిన చావో రేవో మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కరేబియన్‌ జట్టు విధించిన 160 పరుగుల టార్గెట్‌ను భారత జట్టు 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (1), శుభ్‌మన్ గిల్‌ (6) త్వరగా అవుటైనా సూర్యకుమార్‌ యాదవ్‌ చెలరేగి ఆడాడు. కేవలం 44 బంతుల్లోనే 10 ఫోర్లు, 4 భారీ సిక్స్‌ల సహాయంతో 83 పరుగులు చేశాడు.

అతనికి తోడు హైదరాబాదీ ప్లేయర్‌ తిలక్‌ వర్మ (37 బంతుల్లో 49, 4 ఫోర్లు, సిక్స్‌) నిలకడగా ఆడాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 87 పరుగులు జోడించారు. సూర్య ఔటైనా కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (15 బంతుల్లో 20 ఒక ఫోర్‌, సిక్స్‌) మ్యాచ్‌ను ముగించాడు తిలక్‌ వర్మ. ఈ విజయంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో విండీస్‌ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది టీమిండియా. అంతకుముందు బ్యాటింగ్ చేసిన విండీస్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల కోల్పోయి 159 పరుగులు చేసింది. బ్రాండన్‌ కింగ్‌(42) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇక భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ 3 వికెట్లతో రాణించగా, అక్షర్‌, ముఖేష్‌ తలా ఒక వికెట్‌ తీశారు. ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో టీమిండియాను గెలిపించిన సూర్యకుమార్‌ యాదవ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ పురస్కారం లభించింది.

ANN TOP 10