AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మైనార్టీలకు శుభవార్త.. లక్ష రూపాయల ఆర్థిక సాయం

తెలంగాణలోని మైనార్టీలకు బీఆర్ఎస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మైనార్టీల సంక్షేమంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష రూపాయలు ఇటీవలే ప్రకటించిన సంగతి తెలసిందే. అయితే ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముందుగా మొదటి దశలో భాగంగా ఎంపికైనటువంటి పది వేల మంది లబ్ధిదారులకు చెక్కులు ఇవ్వాలని సూచించారు. అయితే లబ్ధిదారులకు ఆగస్టు 16 నుంచి లక్ష రూపాయల చెక్కుల పంపిణీ ప్రారంభించాలని మంత్రి హరీష్ రావు ఆదేశించారు. శాసనసభ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మైనార్టీ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో వారి సమస్యలను చర్చించడానికి సెక్రటేరియట్‌లో మంత్రి హరీష్ రావు నేతృత్వంలో మంగళవారం రోజున సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో మంత్రులు మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, తలసాని శ్రీవనాస్ యాదవ్‌లు పాల్గొన్నారు. ఇలాగే డిప్యూటీ స్పీకర్ పద్మారావు,ఎమ్మెల్యే అక్బరుద్దిన్ ఓవైసీ, చీఫ్ సెక్రటరీ శాంతికుమారీ తదితర అధికారులు పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో మైనార్టీలకు లక్ష రూపాయల ఆర్థిక సాయంతో పాటు ఓవర్‌సీస్ స్కాలర్‌షిప్, స్మశాన వాటికలకు స్థలాల కేటాయింపు వంటి వాటిపై చర్చలు జరిపారు. అలాగే గౌరవ వేతనం పొందే ఇమామ్, మౌజం సంఖ్య పెంపు గురించి మాట్లాడారు.

అలాగే ప్రతి నియోజకవర్గంలో జనాభా దామాషా ప్రకారమే లక్ష రూపాయల ఆర్థిక సహాయం లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియ ఉండాలని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. మైనార్టీల జనాభా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలపై మరింత దృష్టి పెట్టాలని మంత్రి అధికారులకు జారీ చేశారు.

ANN TOP 10