AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

యాదగిరిక్షేత్రంలో లక్షపుష్పార్చన పూజలు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో శనివారం ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని లక్షపుష్పార్చన పూజలు ఆగమ శాస్త్రరీతిలో వైభవంగా కొనసాగాయి. ప్రభాతవేళ సుప్రభాతంతో గర్భాలయంలో కొలువుదీరిన స్వయంభువులను మేల్కొలిపిన ఆచార్యులు నిజాభిషేకం, సహస్రనామార్చన పూజలు నిర్వహించారు. ప్రధానాలయ ముఖమండపంలో ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలు, ముత్యాలు, బంగారు ఆభరణాలతో దివ్యమనోహరంగా అలంకరించి బంగారు సింహాసనంపై అధిష్ఠింపజేశారు.

అర్చకబృందం, వేదపండితులు స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో వివిధ రకాల పుష్పాలతో లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు. సుమారు రెండు గంటల పాటు లక్షపుష్పార్చన పూజలు కొనసాగాయి. అనంతరం ఆలయ అష్టభుజి ప్రాకార మండపంలో సుదర్శన హోమం, నిత్యతిరుకల్యాణపర్వాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనుబంధ శివాలయంలో రామలింగేశ్వరుడికి నిత్య పూజలు, యాగశాలలో రుద్రహవనం శైవాగమ పద్దతిలో నిర్వహించారు.

భక్తజనుల సందడి
యాదగిరిక్షేత్రంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. వరుసగా కురుస్తున్న వర్షాలు తెరిపివ్వడం, సెలవు రోజు కావడంతో ఇష్టదైవాలను దర్శించుకునేందుకు భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు.

ANN TOP 10