AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆగ‌స్టు మొద‌టి వారంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫ‌లితాలు!

ఆగ‌స్టు మొద‌టి వారంలో గ్రూప్-1 ప్రిలిమిన‌రీ ఫ‌లితాలు విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది. ఈ క్రమంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫ‌లితాలను విడుద‌ల చేసేందుకు టీఎస్‌పీఎస్సీ క‌స‌ర‌త్తు చేస్తోంది. వ‌చ్చే వారం ఫైన‌ల్ కీని కూడా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. ఈ ఏడాది జూన్ 11వ తేదీన గ్రూప్-1 ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌ను నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే.

ప్రాథ‌మిక కీని కూడా కొద్ది రోజుల క్రితం విడుద‌ల చేశారు. ప్రాథ‌మిక కీపై వ‌చ్చిన అభ్యంత‌రాల‌ను ఎక్స్‌ప‌ర్ట్ క‌మిటీకి టీఎస్‌పీఎస్సీ పంపింది. ఈ క్ర‌మంలో సోమ లేదా మంగ‌ళ‌వారాల్లో ఫైన‌ల్ కీని విడుద‌ల చేసే అవకాశం ఉంది. తుది కీని విడుద‌ల చేసిన అనంత‌రం ప‌రీక్ష రాసిన అభ్య‌ర్థుల ఓఎంఆర్ షీట్ల‌ను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచ‌నుంది.

ANN TOP 10