AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మణిపూర్‌లో మరో ఘటన.. వ్యక్తి తల నరికి వేలాడదీసిన దుండగులు

మణిపూర్‌కు సంబంధించి ఒక్కొక్క దారుణమైన ఘటనలు బయటికి వస్తున్నాయి. ఇటీవల ఇద్దరు మహిళలను బట్టలు లేకుండా నగ్నంగా ఊరేగించి.. సామూహిక అత్యాచారం చేసిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్రంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తలను అత్యంత దారుణంగా నరికేసి.. కంచెకు వేలాడదీసిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీంతో మణిపూర్‌లో ఇలాంటి ఘటనలు ఇంకెన్ని జరిగాయోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

వ్యక్తి తలను వేలాడదీసిన ఘటన బిష్ణుపూర్‌ జిల్లాలో జరిగినట్లు తెలుస్తోంది. జులై 4 వ తేదీ అర్ధరాత్రి కుకీ, మెయితీ వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇందులో కుకీ తెగకు చెందిన నలుగురు వ్యక్తులను మెయితీ వర్గానికి చెందిన వారు అత్యంత దారుణంగా హత్య చేశారు. ఇందులో డేవిడ్ థీక్‌ అనే వ్యక్తి తలను నరికి.. మొండెం నుంచి వేరు చేశారు. అంతటితో ఆగకుండా అనంతరం అక్కడ వెదురు కర్రలతో చేసిన కంచెకు డేవిడ్ థీక్ తలను వేలాడదీశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌‌గా మారడంతో అసలు విషయం బయటికి వచ్చింది.

మణిపూర్‌లో మెజారిటీలుగా ఉన్న మెయితీలకు ఎస్టీల్లో కలపాలన్న ప్రతిపాదనతో మెయితీ, కుకీ వర్గాల మధ్య ఘర్షణలు ప్రారంభమయ్యాయి. దీనికి వ్యతిరేకంగా కుకీలు మే 3 వ తేదీన భారీ నిరసన ర్యాలీకి పిలుపునిచ్చారు. అయితే ఈ నిరసన ర్యాలీపైకి మెయితీ వర్గానికి చెందిన కొంతమంది అల్లరి మూక రాళ్ల దాడులు చేయడంతో మణిపూర్‌లో శాంతి భద్రతలు అదుపు తప్పాయి. అప్పటి నుంచి మణిపూర్ మొత్తం అట్టుడికిపోతోంది. మణిపూర్ లో చెలరేగిన ఈ హింసాత్మక ఘటనల్లో ఇప్పటివరకు దాదాపు 200 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. వేలాది ఇళ్లు ధ్వంసం కావడంతో ఎంతోమంది నిరాశ్రయులై ప్రభుత్వ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు.

ANN TOP 10