ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైల్లో అక్రమంగా తరలిస్తున్న ఆరుగురు బాలలను బచ్‌పన్ బచావో ఆందోళన్, ఏఐడీ సంస్థ, చైల్డ్ లైన్, ఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం రక్షించారు. ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ విజయవాడ నుంచి ఖమ్మం వస్తున్న క్రమంలో బచ్‌పన్ బచావో ఆందోళన్, ఆర్పీఎఫ్ వారు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి బాలలను అక్రమంగా తరలిస్తున్న అనుమానిత వ్యక్తుల నుంచి వారిని రక్షించారు. ఖమ్మంలోని బాలల సంక్షేమ కమిటీ ముందు వారిని ప్రవేశపెట్టి జిల్లా బాలల పరిరక్షణ విభాగానికి అప్పగించారు. ఈ బాలలను కోల్‌కతా నుంచి హైదరాబాదులో వివిధ ప్రదేశాలలో పనికి తీసుకువెళ్తున్నట్టు వారితో ఉన్న వ్యక్తులు అంగీకరించారని అధికారులు తెలిపారు.









