AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సాయి ధరమ్ తేజ్ షాకింగ్ నిర్ణయం…

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. 6 నెలల పాటు సినిమాలకు దూరంగా ఉండనున్నట్టు ప్రకటించారు. యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత తేజూ రెండు సినిమాలలో నటించాడు. రీఎంట్రీ తర్వాత వచ్చిన ‘విరూపాక్ష’ చిత్రం ఘన విజయం సాధించింది. తాజాగా తన మేనమామ, జనసేనాని పవన్ కల్యాణ్ తో కలిసి నటించిన ‘బ్రో’ ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

యాక్సిడెంట్ నుంచి కోలుకున్నప్పటికీ ఫిజికల్ గా తేజ్ ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమాల నుంచి బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. తాను ఒక చిన్న సర్జరీ చేయించుకోవాల్సి ఉందని తేజూ చెప్పారు. సర్జరీ తర్వాత మరింత బలంగా, పూర్తి ఫిట్ నెస్ తో అభిమానుల ముందుకు వస్తానని తెలిపారు. దీనికి ఆరు నెలల సమయం పట్టవచ్చని చెప్పారు. సర్జరీ కారణంగా కొత్తగా సినిమా కథలను కూడా వినలేదని తెలిపారు. బ్రేక్ తర్వాత దర్శకుడు సంపత్ నంది సినిమాలో నటిస్తానని వెల్లడించారు. మరోవైపు, సమంత కూడా చికిత్స కోసం ఒక ఏడాది పాటు బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే.

ANN TOP 10