AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సమ్మె వీడి.. విధుల్లో చేరండి: హరీశ్ రావు విజ్ఞప్తి

పారిశుద్ధ్య కార్మికులు సమ్మె వీడి విధుల్లో చేరాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. వర్షాకాల నేపథ్యంలో సీజనల్ వ్యాధుల వ్యాపించి ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతాయని. అంటువ్యాధులు పెరిగే అవకాశం ఉంటుందని, పారిశుద్ధ్య కార్మికుల విషయాన్ని ప్రభుత్వం తప్పకుండా ఆలోచన చేస్తుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలే దృష్ట్యా ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని, దయచేసి గ్రామ పంచాయతీ కార్మికులంతా వెంటనే సమ్మె వీడి తమ విధుల్లో చేరాలని పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు.

పారిశుద్ధ్య కార్మికుల విషయాన్ని ప్రభుత్వం తప్పకుండా ఆలోచన చేస్తుందని, ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ అడగకుండానే వెయ్యి రూపాయల వేతనాన్ని పెంచారని గుర్తు చేశారు. ఇప్పటికీ ఆయన దృష్టిలో పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్లు ఉన్నాయని, సమయానుకూలంగా నిర్ణయం తీసుకుంటారని మంత్రి హరీశ్ రావు భరోసా ఇచ్చారు. పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మీతో చర్చలు జరిపి తప్పకుండా వీలైనంత వరకూ త్వరితగతిన సాయం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులంతా సమ్మెను విరమించి అందరూ పని చేయాలని, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇతర రాష్ట్రాల కంటే మన తెలంగాణ రాష్ట్రంలో పారిశుద్ధ్య కార్మికులకు అధికంగా వేతనాలు ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు.

ANN TOP 10