AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అంబేద్కర్ టవర్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!

హైదరాబాద్ లోయర్ ట్యాంక్‌బండ్‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ టవర్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.108 కోట్లతో అంబేద్కర్ టవర్ నిర్మాణానికి పరిపాలనా శాఖ అనుమతిచ్చింది. ప్రస్తుత అంబేద్కర్ భవన్ స్థానంలో 1 సెల్లార్ + గ్రౌండ్ + 10 అంతస్తులతో కొత్త టవర్ ఉంది. 12 ఏళ్లుగా వినియోగంలో లేని పాత అంబేద్కర్ భవన్ పాత భవనం శిథిలావస్థకు చేరడంతో కొత్త టవర్ నిర్మాణానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఆర్‌అండ్‌బీ అధికారులు భవన పరిస్థితిపై సమగ్ర సర్వే నిర్వహించి రూ.108 కోట్ల అంచనా వేసారు. దీంతో కొత్త టవర్ కోసం ఆర్కిటెక్చరల్, స్ట్రక్చరల్ కన్సల్టెన్సీ సేవలు ప్రభుత్వం తీసుకోనుంది. 2026–27 బడ్జెట్‌లో ఇప్పటికే రూ.25 కోట్లను సర్కర్ కేటాయించింది.

ఫైనాన్స్ శాఖ సమ్మతితో రూ.108 కోట్లకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయింది. దీంతో టవర్ నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. తదుపరి చర్యలు చేపట్టాలని ఎస్సీ డెవలప్‌మెంట్ శాఖ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. లోయర్ ట్యాంక్‌బండ్‌లో ఆధునిక సదుపాయాలతో అంబేద్కర్ టవర్ నిర్మాణానికి మార్గం సుగమం అయింది.

ANN TOP 10