AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏపీ డీఎస్సీ వివాదంపై శాసనసభలో రచ్ఛ.. ర్యాంకర్ నవీన్ ఐడీ బ్లాక్ కేసుపై స్పందించిన జగన్..!

ఆంద్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీపై అక్రమాలు జరిగాయంటూ వైసీపీ, టీడీపీ పార్టీల మద్య కొన్ని రోజులుగా రాజకీయంగా హట్ టాపిక్‌గా మారింది. దీంతో డీఎస్సీ పేపర్ తయారీ, నిర్వహణ ఒక్కరే చేయడం వల్ల చెక్స్ అండ్ బ్యాలెన్స్ తప్పి స్కాంకు నాంది పడిందని ఆరోపిస్తున్నారు

ఒకే వ్యక్తి చేతిలో ఈ బాధ్యతలు ఎందుకు పెట్టారు? డీఎస్సీ పేపర్ తయారు చేసిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్‌కు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని అసెంబ్లీలో చంద్రబాబు, లోకేష్ ఒప్పుకున్నారు. ఆ తర్వాత నవీన్ పేరు తీసేసి సెకండ్ మెరిట్ లిస్ట్ ఇచ్చారు. ఫస్ట్ మెరిట్ లిస్టులో ఉన్న ఫస్ట్ ర్యాంకర్ నవీన్‌కు ఎందుకు ఉద్యోగం రాలేదు. నవీన్ పేరు తీసేసి సెకండ్ మెరిట్ లిస్ట్ ఎందుకు ఇచ్చారని వైఎస్ జగన్ ప్రశ్నించారు.

సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు రానందునే నవీన్‌కు ఉద్యోగం ఇవ్వలేదని చంద్రబాబు, లోకేష్ అంటున్నారు.. ఇదే వాస్తవం అయితే నవీన్ అనే అభ్యర్థి కోర్టుకు ఎందుకెళ్లాడని జగన్ ప్రశ్నించారు. తన లాగిన్ ఐడీ బ్లాక్ చేశారని, కాల్ లెటర్ పంపలేదని నవీన్ కోర్టుకెళ్లాడు. తన లాగిన్ ఐడీ బ్లాక్ చేశారంటూ విద్యాశాఖకు నవీన్ మెయిల్ పెట్టాడు. కాల్ లెటర్ పంపనప్పుడు నవీన్ సర్టిఫికేషన్‌కు ఎందుకు వస్తాడని వైఎస్ జగన్ ప్రశ్నించారు.

ANN TOP 10