AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాంగ్రెస్‌ వెంటే యువత

కంది శ్రీనన్న సమక్షంలో భారీగా చేరికలు
ఆదిలాబాద్‌: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయ‌కులు కంది శ్రీ‌నివాస‌రెడ్డి స‌మ‌క్షంలో భారీసంఖ్యలో యువ‌కులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రజాసేవా భ‌వ‌న్‌లో ప‌ట్టణంలోని 16వ‌ వార్డు ఖుర్షిద్‌న‌గ‌ర్ నుంచి షేక్ స‌లీం ఆధ్వర్యంలో ప‌లువురు యువకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి కంది శ్రీ‌నివాస‌రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా కంది శ్రీ‌నివాస‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ‌లో అధికారమే ల‌క్ష్యంగా కార్యకర్తలు క్షేత్ర స్థాయిలో సైనికుల్లా ప‌ని చేయాల‌ని అన్నారు. ద‌శాబ్దాలుగా ప్రజ‌ల అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించిన స్థానిక ఎమ్మెల్యే జోగు రామ‌న్నను ఓడ‌గొట్టి ఇంట్లో కూర్చోబెట్టాల‌న్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమ‌ని పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు.

ANN TOP 10