జై సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమైన నవదీప్.. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే వరుసగా హిట్స్ అందుకున్న ఈ హీరో నటించిన చిత్రాలు ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో సెకండ్ హీరోగా.. సహయ నటుడిగా కనిపించారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న నవదీప్… ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఇటీవలే ప్రముఖ ఓటీటీ మాధ్యామం ఆహాలో న్యూసెన్స్ వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఓవైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు నవదీప్. ఈ క్రమంలోనే అతని మోకాలికి గాయమైనట్లుగా తెలుస్తోంది. మోకాలికి ఎక్కువగా గాయమవడంతో అతను ప్రస్తుతం కర్ర సహయంతో నడుస్తున్నారు. అయితే కొద్ది రోజులుగా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు నవదీప్. ఈ క్రమంలోనే అతని స్నేహితురాలు తేజస్వి ఓ ఫన్నీ వీడియో తన ఇన్ స్టాలో షేర్ చేసింది.
ఇటీవల నవదీప్ కాలికి గాయమైంది. దీంతో అతను ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతడిని పరామర్శించడానికి వచ్చిన తేజస్విని.. ఆటపట్టిస్తూ పన్నీగా ఓ రీల్ చేసింది. ఆ వీడియోను ఇన్ స్టాలో షేర్ చేసింది. అయితే కాలికి గాయంతో నవదీప్ కూర్చొని ఉండగా.. ‘నీ సుఖమే నే కోరుకున్నా.. ‘ అనే పాటకు సరదాగా డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుండగా.. నవదీప్ తొందరగా కోలుకోవాలంటూ కొందరు కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం వీడియో ఫన్నీగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.









