తనదైన శైలిలో పంచ్ డైలాగ్‌లు, డ్యాన్స్‌లతో నిత్యం వార్తల్లో నిలిచే మంత్రి మల్లారెడ్డి ఈసారి గొర్రెల కాపరి అవతారమెత్తారు. ఇవాళ మేడ్చల్ మండలం గౌడవెల్లి గ్రామంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన గొర్రెల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన లబ్ధిదారులకు గొర్రెలు పంపిణీ చేశారు. అనతరం నెత్తిన గొంగడి వేసుకొని కాసేపు గొర్లు కాశారు.









