
ఆదిలాబాద్ లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్
మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ కాంగ్రెస్లోచేరిక
ఆదిలాబాద్: కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ నాయకులు భారీ సంఖ్యలో కాంగ్రెస్లో చేరారు. ఆదిలాబాద్ పట్టణంలోని బొక్కలగూడ కాలనీలో చేరిక కార్యక్రమం జరిగింది. బీఆర్ఎస్ నేత మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ ప్రాతినిధ్యం వహిస్తున్న 29వ వార్డుతో పాటు 28వ వార్డునుంచి కూడా పెద్దసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్లో చేరారు. జహీర్ రంజానీ సమీప బంధువు వసీం రంజానీ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో చేరారు.
వారందరికీ కంది శ్రీనివాస రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. ఇన్నేళ్లుగా తమ కాలనీలో ఎలాంటి అభివృద్ధి లేదని అందుకే కాంగ్రెస్ లో చేరుతున్నట్టు వారు తెలిపారు. ఈ సందర్భంగా కంది శ్రీనన్న మాట్లాడుతూ ఎమ్మెల్యే జోగు రామన్న ఆదిలాబాద్ ను భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇప్పించలేదన్నారు. కొత్త రేషన్ కార్డులు ,ఫించన్ ల ఊసేలేదన్నారు. జోగు రామన్నను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గానికి చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. ఒకసారి మంత్రిగా ఉన్నప్పటికి పేదలకు ఒరిగిందేమీలేదన్నారు.
అబద్ధాల హామీలిచ్చి, ప్రజలను మోసం చేసిన జోగు రామన్న ఒక జూటా రామన్నఅని విమర్శించారు. తనకు వయసైపోయిందని ,ఇవే చివరి ఎన్నికలంటూ మళ్లీ ఓట్ల కోసం నాటకమాడతారని ఆరోపించారు. ఆయన మీ వద్దకు వచ్చినప్పుడు మాకేం చేసినవ్ అంటూ గట్టిగా నిలదీయాలని పిలుపునిచ్చారు. ఇలాంటి అసమర్థ, అబద్ధాల ఎమ్మెల్యేను ఓడించాలా వద్దా అన్న ప్రశ్నకు ఓడించాలి ఓడించాలి అంటూ ప్రజలు బలంగా నినదించారు. జోగు రామన్నను చిత్తుగా ఓడించి హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. మీ అందరి ఆశీర్వాదం తనకు కావాలని కంది శ్రీనివాస రెడ్డి ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సెల్ చైర్మన్ ఎంఏ. షకీల్, వసీం రంజానీ, మైనారిటీ సెల్ టౌన్ ప్రెసిడెంట్ మొసిన్ పటేల్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రెసిడెంట్ అర్ఫాత్ ఖాన్ ,జిల్లా అధ్యక్షుడు చరణ్ గౌడ్, ,గిమ్మసంతోష్, అల్లూరి అశోక్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, షమీఉల్లా ఖాన్, రషీద్ ఖాన్,షేక్ రహీం ,అఫ్సర్, అజ్బత్ ఖాన్, ముఖీం తదితరులు పాల్గొన్నారు.











