AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మూడో అంతస్తు నుంచి జారి పడి బాలుడి మృతి

హైదరాబాద్‌ నగర శివారు నార్సింగి ఠాణా పరిధిలోని పుప్పాలగూడలో విషాదం చోటు చేసుకుంది. మూడో అంతస్తు నుంచి స్మిమ్మింగ్‌పూల్‌లో జారి పడి ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. ఓ అపార్ట్‌మెంట్‌లో తన స్నేహితులతో కలిసి మూడో అంతస్తులో ఆడుకుంటున్న దేవాన్ష్‌.. ప్రమాదవశాత్తు జారి కింద స్విమ్మింగ్‌పూల్‌ పడ్డాడు. దీంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిన బాలుడిని.. తల్లిదండ్రులు హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే దేవాన్ష్‌ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బాలుడి తండ్రి రవి ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ANN TOP 10