AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘నేను పోటీ చేసేది అక్కడి నుంచే’.. మదిలోని పేరు చెప్పేసిన పొంగులేటి..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారనే విషయంపై క్లారిటీ ఇచ్చేశారు కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. తన మనసులో మూడు స్థానాలు ఉన్నాయని, అయినా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. ఓ టీవీ చానల్‌ బిగ్ డిబేట్ కార్యక్రమంలో పలు ప్రశ్నలకు పొంగులేటి సమాధానమిచ్చారు.

ఖమ్మం నియోజకవర్గం నుంచి మంత్రిగా ఉన్న పువ్వాడ అజయ్‌ని ఓడించడానికి, ఆయనపై పోటీ చేయడానికి సిద్ధమా అని అడగ్గా..‘నేను ఓడించను, ప్రజలే ఓడిస్తారు. పార్టీ ఎక్కడ నుంచి పోటీ చేయమన్నా పోటీ చేసేందుకు సిద్ధం’ అన్నారు. ఇంకా కొత్తగూడెం, ఖమ్మం, పాడేరు తన ఆప్షన్స్ అని, కాంగ్రెస్‌ పార్టీలో పదవులను ఆశించడంలేదని చెప్పుకొచ్చారు.

ANN TOP 10