AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

భయంతో వణికిస్తున్న ‘మంగళవారం’

ఉత్కంఠ కలిగిస్తూ ఆసక్తి పెంచిన అజయ్ భూపతి ‘మంగళవారం’ సినిమా టీజర్

పచ్చటి తోటలు… వాటి మధ్యలో ఊరు… ఆ ఊరి మధ్యలో ఓ అమ్మవారి గుడి… వందల మంది ప్రజలు… పొలాలు పచ్చగా ఉంటే, ప్రజల కళ్ళల్లో ఆశ్చర్యంతో కూడిన భయం! ఆఖరి మూగ జంతువుల కళ్ళలో కూడా! అందుకు కారణం ఏమిటి? అనేది తెలియాలంటే న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్ అజయ్ భూపతి కొత్త సినిమా ‘మంగళవారం’ థియేటర్లలోకి వచ్చే వరకు వెయిట్ చేయాలి.

‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు అజయ్ భూపతి సరికొత్త వినోదాన్ని పరిచయం చేశారు. ఇంటెన్సిటీతో కూడిన యాక్షన్, రొమాన్స్, షాకింగ్ ట్విస్ట్‌లను కలిపి కల్ట్ సినిమా చూపించారు. ‘మహాసముద్రం’లో యాక్షన్ డోస్ మరింత పెంచారు. ఆ రెండు సినిమాల తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం వహించిన తాజా సినిమా ‘మంగళవారం’. ఇందులో పాయల్ రాజ్‌పుత్ ఓ ప్రధాన పాత్రధారి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతోంది. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ నేడు విడుదల చేశారు.

 

ANN TOP 10