AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సర్వే ప్రకారమే టికెట్లు.. కాంగ్రెస్ నేత భట్టి కీలక వ్యాఖ్యలు

ఖమ్మం సభతో ఫుల్ జోష్‌లో ఉన్న కాంగ్రెస్.. స్పీడును మరింత పెంచింది. అంతర్గత విబేధాలు పక్కనపెడితే.. ఇప్పుడు టికెట్ల గురించి సరికొత్త టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. టికెట్ల విషయంలో నేతలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ భట్టి విక్రమార్క సూచించారు. సర్వేల ప్రకారమే టికెట్స్ ఇస్తారని.. ఆందోళన పడొద్దంటూ పేర్కొన్నారు. తెలంగాణలో బిజెపి పని అయిపోయిందని.. దాని గురించి మాట్లాడటానికి ఏమి లేదంటూ భట్టి పేర్కొన్నారు. కాంగ్రెస్ లో చేరడానికి చాలా మంది నేతలు సిద్దంగా ఉన్నారని.. అంతా ఒకేసారి చేరరని.. విడతల వారీగా కాంగ్రెస్ లో చేరతారంటూ భట్టి విక్రమార్క వివరించారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీ పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌.. భారతీయ జనతా పార్టీ బీ టీమ్‌ అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మరోసారి ఆరోపించారు. బీజేపీయేతర పక్షాల్లో చీలిక కోసం సీఎం కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని.. అందులో భాగంగానే ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్‌తో భేటీ అయ్యారని పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్‌కి ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టేనని.. బీజేపీయేతర శక్తులు బీఆర్‌ఎస్‌కు దూరంగా ఉండాలని భట్టి కోరారు. బీజేపీకి మేలు చేయాలన్నదే బీఆర్‌ఎస్‌ తాపత్రయమని పేర్కొన్నారు. త్వరలో ప్రాజెక్టుల సందర్శనకు వెళ్తాం CLP నేత భట్టి పేర్కొన్నారు.

ANN TOP 10