AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏఐసీసీ అధికార ప్రతినిధిగా షర్మిల?

వైఎస్సార్‌ టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తన పార్టీని త్వరలో కాంగ్రెస్‌ లో విలీనం చేయనున్నారన్న ప్రచారం జోరందుకుంది. అంతేకాదు షర్మిలకు ఏఐసీసీ అధికార ప్రతినిధి పదవి ఇస్తారని టాక్‌ నడుస్తోంది. షర్మిల కాంగ్రెస్‌ లో చేరడం దాదాపుగా ఖాయమని ప్రచారం సాగుతోంది.

లేటెస్ట్‌ గా జరుగుతున్న ప్రచారం ఏంటి అంటే షర్మిలకి ఏఐసీసీ అధికార ప్రతినిధి పదవి ఇస్తారని సమాచారం. ఈ పదవిలో ఆమె ఉంటే ఆమె రేపటి ఎన్నికల్లో తెలంగాణాలో ప్రచారం చేసినా ఏపీ ముద్ర కానీ ఆంధ్రా మూలాలు అన్న సమస్య కానీ రాకుండా ఉంటుందని కాంగ్రెస్‌ హై కమాండ్‌ ఆలోచిస్తోంది అని అంటున్నారు. అదే విధంగా ఆమెను రేపు తెలంగాణాలో జరిగే ఎన్నికల్లో పోటీకి దించకుండా కేవలం ప్రచారానికి మాత్రమే వాడుకోవాలని ఆలోచిస్తున్నారుట.

అందుకేసమే ఆమెకు ఏఐసీసీ అధికార ప్రతినిధి పదవి అని అంటున్నారు. ఇక షర్మిలకు ఒక అధికార పదవి కావాలి కనక ఆమెను కర్నాటక కోటాలో రాజ్యసభకు నామినేట్‌ చేస్తారని అంటున్నారు. ఇక తెలంగాణా ఎన్నికల్లో ఆమె సేవలను పూర్తిగా ఉపయోగించుకోవాలన్న ఆలోచనలు ఉన్నారట.

అంతేకాదు షర్మిల పార్టీని విలీనం చేసుకునే విషయంలో కాంగ్రెస్‌ మాస్టర్‌ ప్లాన్‌ తోనే ఉంది అని అంటున్నారు. ఆమెను కేవలం తెలంగాణాకే పరిమితం చేస్తే మాత్రం బీఆర్‌ఎస్‌ దాన్ని ఆయుధంగా తీసుకుంటుందని కాంగ్రెస్‌ భావిస్తున్నారు. దాని వల్ల కాంగ్రెస్‌ పెద్దలు షర్మిల బాణాన్ని కేసీయార్‌ తో పాటు జగన్‌ మీద కూడా గురిపెట్టే లాగానే పక్కాగా పథక రచన చేస్తున్నారు అని అంటున్నారు.

ఇదిలా ఉంటే వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌ అగ్ర నేత ప్రియాంకా గాంధీతో టచ్‌ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రియాంకా గాంధీయే చూస్తున్నారు. ఒకటి రెండు రోజులలో షర్మిల కాంగ్రెస్‌ లో చేరే విషయం మీద పూర్తి క్లారిటీ రావచ్చు అని అంటున్నారు.

ANN TOP 10