AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రేవంత్ రెడ్డి ఫోన్ చేసిండు.. నా ట్వీట్ చూసి శభాష్ అని పొగిడిండు

మొన్నటి దాకా ట్వీట్ల యుద్ధం.. నిన్న అనూహ్యంగా ఆత్మీయ సమావేశం. ఇవాళ వీడియో విడుదల.. ఆ బీజేపీ నేతల తీరు.. తెలంగాణ బీజేపీలో ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర పార్టీలో మార్పులపై ఢిల్లీ లెవెల్‌లో కసరత్తులు జరుగుతుంటే.. నిన్నటిదాకా కత్తులు దూసుకున్న ఆ నేతలు ఇప్పుడు ఆత్మీయంగా కలుసుకోవడం కాక పుట్టిస్తోంది. సోమవారం ఒక్కసారిగా లంచ్ మీట్‌లో కలుసుకోవడం ఇంట్రెస్టింగ్‌గా మారింది. బండి సంజయ్ నాయకత్వాన్ని ప్రశ్నించే వారికి దున్నపోతుల ట్రీట్మెంట్ అంటూ జితేందర్ రెడ్డి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై ఈటల రాజేందర్ సైతం ఘాటుగా స్పందించారు.

సీనియర్లు, అన్నీ తెలిసిన వారు ఇతరుల ఆత్మగౌరవానికి భంగం కలిగించవద్దని కామెంట్స్ చేశారు. వయసు పెరిగిన కొద్దీ జాగ్రత్తగా మాట్లాడాలని వార్నింగ్ కూడా ఇచ్చారు. అలాంటి నేతల మధ్య లంచ్ మీట్ నవ్వులు.. ఆత్మీయ ఆలింగనాల మధ్య సాగడం విశేషం. అయితే తాజాగా ఆయన విడుదల చేసిన వీడియో మరింత హాట్ హాట్‌గా మారింది.

ట్వీట్‌కు వివరణ ఇచ్చుకోవడం ఉండదని బీజేపీ సీనియర్ నేత ఏపీ జితేందర్ రెడ్డి అన్నారు. ట్వీట్ అంటే ఏంటో చెప్పారు జితేంర్ రెడ్డి. దానికి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం ఉండదన్నారు. రేవంత్ రెడి తనపైన ఎలాంటి ఆరోపణలు చేయలేదన్నారు. తనకు ఫోన్ చేసిన మీది చాలా కవి హృదయం.. మీరు మంచి రైటర్.. మీరు చేసిన ట్వీట్ చాలా బాగా చేశారు శభాష్ అన్నారు.. అంటూ తెలిపారు జితేందర్ రెడ్డి.

ANN TOP 10