రాష్ట్రంలో తాగునీటికి ప్రాధాన్యత ఇవ్వాలని, గోదావరి, కృష్ణా నదుల పరిధిలోని రిజర్వాయర్లలో నీటి నిల్వలను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, ఈ దిశగా ఇరిగేషన్ శాఖ, విద్యు త్ శాఖ సమన్వయంతో పనిచేయాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. ఎత్తిపోతలకు సరిపోయే విద్యుత్‌ను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఇరిగేషన్ శాఖ, వి ద్యుత్ శాఖ సమన్వయం చేసుకోవాలని సి ఎం ఆదేశించారు. కష్టకాలంలో నీటిని వినియోగించుకోవడంలో రాష్ట్ర ప్రజలు, రైతాం గం జాగ్రత్త వహించాలని, నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని అందుకు వ్యవసాయ ఇరిగేషన్ శాఖ ఇంజినీర్ల సూచన లు, సలహాలు పాటిస్తూ పంటలు పండించుకోవాలని రైతులకు సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు. ఎన్ని కష్టాలు వచ్చినా రాష్ట్ర రైతాంగాన్ని, వ్యవసాయాన్ని కాపాడుకోవడమే ప్ర ధాన లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటామని సిఎం పునరుద్ఘాటించారు.
చుక్క ఒడిసిపట్టి, ప్రజలకు నీటిని అందించాలని సిఎం అధికారులకు సూచించారు. రాష్ట్రం లో వర్షపాతం, ప్రాణహిత తదితర నదుల్లో ప్రవహిస్తున్న నీటి లభ్యత, రాష్ట్రంలోని రిజర్వాయర్లలోని నీటి నిల్వలు, ప్రస్తుతం కొనసాగుతు న్న విద్యుత్ డిమాండ్ తదితర పరిస్థితులపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి కె. చం ద్రశేఖర్‌రావు డా. బి.ఆర్.అంబేద్కర్ రా ష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రా జెక్టులోని నీటి లభ్యతా వివరాలను సిఎం కె సిఆర్‌కు ఆయా శాఖల ఉన్నతాధికారులు వివరించారు. ఇన్ని రోజులు ఒకెత్తు, ఇప్పుడు ఒకెత్తు అని, ఇది ఇరిగేషన్ శాఖకు పరీక్ష వంటిదని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. ఇది మునుపటి తెలంగాణ కాదు. నీటి సమస్య లేకుండా ప్రాజెక్టులు కట్టుకున్నామని, తాగు, సాగునీటి అవసరాలకు సమృద్ధిగా నీరు అందుతుందన్నారు. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడే మన సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని కెసిఆర్ పేర్కొన్నారు.









