AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేడు హైదరాబాద్‌కు అఖిలేష్ యాదవ్

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సోమవారం హైదరాబాద్ రానున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన ఖరారైంది. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టునకు చేరుకునే అఖిలేష్ యాదవ్, ఆపై ప్రగతి భవన్ లో సిఎం కెసిఆర్‌తో సమావేశమవుతారు. ఆయనతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన తరువాత, కెటిఆర్ సహా కొంతమంది నేతలతోనూ ఆయన భేటీ అవుతారు.

అఖిలేష్ యాదవ్‌కు కమ్మనైన విందు ఇచ్చేందుకు ఉత్తరాది, దక్షిణాది వంటకాలను సిద్ధం చేయాలని కెసిఆర్ ఆదేశించినట్టు సమా చారం. ఈ భేటీల తరువాత సాయంత్రం 4.30 గంటలకు అఖిలేష్ లక్నో తిరిగి బయలుదేరుతారు. అఖిలేష్ కు స్వాగతం పలికి ప్రగతి భవన్‌కు తీసుకువచ్చే బాధ్యతను కొందరు మంత్రులకు కెసిఆర్ అప్పగించినట్టు తెలుస్తోంది.

ANN TOP 10