AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పాటే ప్రాణం.. ఉద్యమమే ఊపిరి

ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి వేలాది మంది గుండెల్లో ప్రేమను సంపాదించిన సాయిచంద్ ఇక లేడని, ఆయన గొంతు ఇక వినపడదని వేలాది మంది ప్రజలు కన్నీరు మున్నీరు అవుతున్నారు. సాయిచంద్‌ది వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రం. ఆయన సెప్టెంబర్ 20,1984 లో జన్మించారు. తండ్రి వెంకట్రాములు తల్లి మనెమ్మ. వారికి ఇద్దరు మగ పిల్లలు. వీరిలో సాయిచంద్ రెండవ కుమారు డు. పెద్ద కుమారుడు మిలటరీలో పని చేస్తూ గత కొంతకాలం క్రితం ఆనారోగ్యంతో చనిపోయారు. తల్లి మనెమ్మ కూడా గత కొంత కాలం క్రితం కరెంట్ షాక్‌తో మృతి చెందా రు. తండ్రి వెంకట్రాములు ఆర్‌టిసి కండెక్టర్‌గా పని చేస్తూ విప్లవ భావాలవైపు ఆకర్షితులయ్యారు.

కండెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తికాలంగా సిపిఐ ఎంఎల్ ప్రజా పంథ పార్టీలో పని చేస్తూ వచ్చారు. ఒక వైపు పార్టీలో పని చేస్తూనే మరో వైపు కుటుంబాన్ని నడుపుకుంటూ వచ్చారు. వెంకట్రాములకు పాటలన్నా, ప్రజా కళలు అన్నా ప్రాణం. ఈ నేపథ్యంలో ఆయన పూర్తి కాలంగా ఆరుదోదయ కళామండలిలో పని చేశారు. అమరచింతలో పార్టీ బలంగా ఉన్న సందర్భంలో పార్టీ ఆధ్వర్యంలోనే ఒక పాఠశాలను నడిపిం ది. ఈ పాఠశాలలోనే సాయిచంద్ 1 నుంచి 5 వరకు చదుకున్నారు. 6 నుంచి పదవతరగతి వరకు అమరచింతలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పని చేశారు.

ఇంటర్‌మీడియట్ ఆత్మకూర్ ప్రభుత్వ కళాశాలలో చదివారు. డిగ్రీ హైదరాబాద్‌లోని విద్యానగర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజిలో చదివారు.ఎంఎ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నా రు. ఇంటర్ వరకు సాయిచంద్ పిడియస్‌యు నేతగా ఉంటూ వ చ్చారు. తండ్రి ఆరుణోదయ కళాకారుడు కావడంతో తండ్రి వారసత్వాన్ని పునికిపుచుకున్న సాయిచంద్ కూడా పాటలు పాడేవారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో పిడియస్‌యు లో ఉంటూనే తెలంగాణా రాష్ట్ర సాధనలో కీలకంగా పని చే శారు. పాటల ద్వారా తెలంగాణా కళాకారులు ధూంధాం ఏ ర్పాటు చేయడంతో అందులో చేరారు.

2012లో ప్రేమ వివాహం

సాయిచంద్‌ది ప్రేమ వివాహం. ఉస్మానియా యూనివర్సిటీ లోచదుకునే క్రమంలో విద్యార్ది ఉద్యమ నేతగా ఉంటూ ఆట, పాటలతో ఉన్న ఆయన అదే యూనివర్సిటీలో ఉన్న రజనినీ 2012లో ప్రేమ వివాహం చేసుకున్నారు. మొదట్లో ఇరువురి కులాలు వేరు కావడంతో రజని తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినప్పటికి తర్వాత ఇరువురి పెద్దల సహకారంతో ప్రేమ వి వాహం చేసకున్నారు. రజినిదీ కూడా జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండలం వేముగోముల గ్రామం. వీరికి కుమారుడు చెర్రి..కూతురు నది ఉన్నారు.

ANN TOP 10