AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సీట్ల వ్యవహారంపై వీహెచ్ సంచలన వ్యాఖ్యలు..

ఇప్పుడిప్పుడే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దశ మారుతోంది. ఈ క్రమంలో పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు వీహెచ్ ఏమన్నారంటే.. ‘‘హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక గెలుపుతో కాంగ్రెస్ వేవ్ స్టార్ట్ అయింది. పొంగులేటి చేరిక ఖాయమే. ఎలాంటి కండిషన్ లేకుండా పార్టీలో చేరుతున్నారు. అన్ని సీట్లు పొంగులేటి వర్గానికి అనేది అవాస్తవం. అలా ఇస్తే ముందు నుంచి కష్టపడ్డ మా నేతలు ఏం కావాలి? వాళ్ళు వచ్చిన తరువాత పనీతిరును బట్టే టికెట్లు. ఇదంతా కేసి వేణుగోపాల్ చూసుకుంటారు’’ అని వీహెచ్ అన్నారు. పార్టీలో మంచి చేరకలు అవుతున్నాయి. పార్టీకి రానున్న రోజుల్లో అంతా బాగుంటుందని ఆనందించాల్సిన తరుణంలో సీట్ల గొడవ తీసుకు రావడమెందుకనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇంకా వీహెచ్ మాట్లాడుతూ.. ‘‘రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేసిన పాదయాత్ర తో రైతులు, బడుగు బలహీన వర్గాల సమస్యలు తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పదు. బీసీలు జనాభాలో 54 శాతం ఉన్నా కూడా సరైన న్యాయం జరగడం లేదు. కుల జనాభా లెక్కలు చేస్తామని చెప్పింది రాహుల్ గాంధీ. జూన్ 19న రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా అన్ని కులాలు రాహుల్ గాంధీ ఫొటోకి పాలాభిషేకాలు చేయాలి. బీసీ గర్జన పెడుతున్నాం. సిద్దరామయ్యని బీసీ గర్జనకి పిలుస్తున్నాం. రాహుల్ గాంధీని కూడా ఆహ్వానిస్తాం. బీసీ సమస్యలను కింది స్థాయిలోకి తీసుకెళదాం’’ అని పేర్కొన్నారు.

ANN TOP 10