AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సీఎం కేసీఆర్ పాలనను చూసి ఓర్వలేకే కుట్రలు

తెలంగాణలోని సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాయపర్తిలో ఏర్పాటు చేసిన తెలంగాణ సంక్షేమ సంబరాల్లో ఎర్రబెల్లి పాల్గొన్నారు. సంక్షేమ సంబరాల్లో భాగంగా పలువురు లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి,షాదీముబారక్ చెక్కులు, కులవృత్తులకు ప్రభుత్వం అందించే లక్షరూపాయల మంజూరు పత్రాలను అందించారు.

ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఆసరా పింఛన్లు, కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ పథకాలు ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్నాయా? అని ప్రశ్నించారు. సంక్షేమ రంగంలో తెలంగాణ దూసుకొళ్తోందన్నారు. సీఎం కేసీఆర్ పాలనను చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ బీజేపీ నాయకులు కుట్రలు చేస్తున్నారన్నారు. అభివృద్ది సంక్షేమంపై మాట్లాడే దమ్ములేకే బీజేపీ నాయకులు గాలిమాటలు మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ పాలనపై అసత్యాలు మాట్లాడుతున్న ప్రతిపక్షాలకు ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలన్నారు. జనరంజక పాలన అందిస్తున్న సీఎం కేసీఆర్ కు జనం అండగా నిలువాలని ఎర్రబెల్లి పేర్కొన్నారు.

ANN TOP 10