టాలీవుడ్ యంగ్ హీరోలు ఒక్కొక్కరుగా తమ బ్యాచిలర్ లైఫ్‌కు ముగింపు పలుకుతున్నారు. రీసెంట్‌గా శర్వానంద్ తన బ్యాచిలర్ లైఫ్‌కు ముగింపు పలికి ఒకింటి వాడయ్యాడు. ఈ కోవలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. త్వరలో పెళ్లి పీఠలు ఎక్కబోతున్నాడు. ఈ రోజు లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ నిశ్చితార్థం..కన్వెన్షన్ సెంటర్‌లో జరగుతోంది.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థానికి ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలతో పాటు కొంత మంది బంధు మిత్రులు మాత్రమే హాజరయ్యారు. వీరి నిశ్చితార్థానికి సంబంధించిన క్రతువును మొదలు పెట్టినట్టు సమాచారం. నిశ్చితార్ధ వేడుకలో లావణ్యకు డైమండ్ రింగ్ తొడగనున్నట్టు సమాచారం. ఇది దాదాపు రూ. 25 లక్షల వరకు ఉన్నట్టు సమాచారం. మరోవైపు లావణ్య కూడా వరుణ్ తేజ్‌కు అదే లెవల్లో నిశ్చితార్ధపు ఉంగరం పెట్టనున్నట్టు మెగా కాంపౌండ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక వీరిద్దరి పెళ్లి కోసం ప్రత్యేకంగా కార్డ్స్ రెడీ చేయించినట్టు సమాచారం. దీని విలు అక్షరాల రూ. 80 వేలకు పైగానే ఉంటుందనేది సమాచారం. అంతేకాదు ఈ ఒక్క కార్డు ధరతో తులంన్నర బంగారంటే కంటే ఎక్కువ అని అందరు చెప్పుకుంటున్నరు. మొత్తంగా ప్రత్యేకమైన వ్యక్తుల కోసం 200దాకా ఈ కార్డులు ప్రింట్ చేయించనున్నట్టు సమాచారం. ఇక పెళ్లి కూడా రాజస్థాన్‌లో ఓ బడా ప్యాలెస్‌లో చేయాలనే ఆలోచనలో ఉన్నారట. దీనిపై అధికారిక ప్రకటన వెలుబడాల్సి ఉంది. దాదాపు అక్కడే పెళ్లి చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.









