AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మంచిర్యాల జిల్లాకు నేడు ముఖ్యమంత్రి కేసీఆర్‌

మంచిర్యాల జిల్లా నస్పూర్‌ మున్సిపాలిటీలో శుక్రవారం సీఎం కేసీఆర్‌ పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన సాయంత్రం 4 గంటలకు నస్పూర్‌కు చేరుకొని అక్కడ నూతనంగా బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. పార్టీ కార్యాలయంలో దాదాపు ఆరగంటకు పైగా గడిపిన తరువాత సమీపంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని ప్రారంభిస్తారు.

నూతన పథకాలకు శ్రీకారం..
కలెక్టరేట్‌ భవనం ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్‌ సభాస్థలిలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి కోసం కులవృత్తులు చేసుకొనే అర్హులైన లబ్ధిదారులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం పథకాన్ని ప్రారంభిస్తారు.

– నియోజక వర్గానికి 1,100 చొప్పున దళిత కుటుంబాలకు ఆర్థిక చేయూత అం దించేందుకు దళితబంధు రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
– ఇంటి స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోలేని వారి కోసం 3 లక్షల రూపాయల సహా యం అందించేందుకు అమలు చేస్తున్న ‘గృహ లక్ష్మి’ పథకాన్ని ప్రారంభిస్తారు.

అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 1,658 కోట్ల రూపాయల వ్యయంతో చెన్నూర్‌ నియోజకవర్గం పరిధిలో దాదాపు లక్ష ఎకరాలకు నీరు అందించే చెన్నూరు ఎత్తిపోతల పకథం, మందమర్రి మండలంలో సుమారు 500 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయ నున్న ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ పనులకు శంకుస్థాపన చేస్తారు. మంచిర్యాల- అంతర్గాం మధ్య గోదావరి నదిపై 164 కోట్లతో నిర్మించనున్న అంతర్‌జిల్లా వంతెన, హాజీపూర్‌ మండలం గుడిపేటలో 205 కోట్ల రూపాయలతో నిర్మించనున్న వైద్య కళాశాల భవనం పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌వరకు బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

ANN TOP 10