AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బోరున ఏడుస్తూ ఆమె కాళ్లమీద పడిపోయిన సిద్ధార్థ్..

నటుడు సిద్ధార్థ్ 20 ఏళ్ల కిందట ‘బాయ్స్’ (Boys) సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రంలో జెనీలియా హీరోయిన్‌. అయితే ఈ మూవీలో అవకాశం రావడానికి కారణమైన వ్యక్తి సుజాత (Sujtaha). లేటెస్ట్‌గా సిద్ధార్థ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. సర్‌ప్రైజింగ్‌గా స్టేజిపైకి వచ్చిన ఆమెను చూసి ఏడ్చేయడంతో పాటు కాళ్లమీద పడిపోయాడు. అనంతరం మాట్లాడుతూ.. ఆమె లేకుండా హీరోగా తనకు ఈ 20 ఏళ్ల కెరీర్ ఉండేది కాదని వెల్లడించాడు. ఎందుకంటే బాయ్స్ చిత్రం కోసం డైరెక్టర్‌ శంకర్‌కు (Shankar) తనను పరిచయం చేసింది సుజాతనే.

ఇంతకీ సుజాత ఎవరంటే.. ప్రముఖ రచయిత, స్క్రీన్‌ప్లే రైటర్, లేట్ సుజాత రంగరాజన్ వైఫ్. అయితే, ఈ స్పెషల్ ఇంటర్వ్యూలో సడెన్ విజిట్ తర్వాత సిద్ధార్థ్ గురించి పలు విషయాలు వెల్లడించారు. ‘బాయ్స్’ సినిమా కంటే ముందు సిద్ధార్థ్.. స్టార్ డైరెక్టర్ మణిరత్నం వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసేవాడు. డైరెక్టర్ కావాలనేది తన డ్రీమ్. ‘శంకర్‌ తీయబోయే చిత్రంలో సిద్ధార్థ్‌ను తీసుకోవాలని నా భర్తను అడిగాను. కానీ తనేమో నేను నటించనని చెప్పాడు. శంకర్ కూడా ఈ విషయమై సిద్ధార్థ్‌తో మాట్లాడాడు కానీ తను తిరస్కరించాడు. అప్పుడు మణిరత్నం సిద్ధార్థ్‌తో మాట్లాడి పంపించాడు. అలా బాయ్స్ సినిమాలో హీరో అయ్యాడు’ అన్నారు.

ఇక సిద్ధార్థ్ సైతం అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నాడు. ‘మణి సర్‌తో పని చేస్తున్నప్పుడు నేను చదివిన మొదటి పదం సుజాత రంగరాజన్ సర్ రాసినదే. సుజాత అమ్మ నా గురించి శంకర్ సర్‌కి చెప్పకపోతే, నా జీవితం ఎలా ఉండేదో. ఇలా 20 ఏళ్ల ఫిలిం కెరీర్ కొనసాగేది కాదు. ఇది ఎప్పటికీ మరిచిపోలేను. నిజంగా ఒక్క క్షణం సర్‌ప్రైజ్ అయ్యాను. నేను మామూలుగా సర్‌ప్రైజ్ అవ్వను కానీ ఇది మాత్రం నాకు సర్‌ప్రైజ్‌ను మించిన ఫీలింగ్. ఇక మణి సర్‌ను ఇప్పుడు అడిగినా సరే.. యాక్టింగ్ మీకు మంచిది కాదని చెప్తారు. ఒకరకంగా అది నిజమే అయినా, దాన్ని ఆయన నామీద చూపే ప్రేమగా తీసుకుంటాను’ అని తెలిపారు. కాగా ఈ ఎమోషనల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ANN TOP 10