వరంగల్ సిటీలో (Warangal City) లింగ నిర్థారణ పరీక్షల ముఠాను పోలీసులు (Police) అరెస్ట్ చేశారు. మహిళా ఎస్‌ఐని అబార్షన్ కోసం పంపించి నిందితులను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రైవేట్ వైద్యులు, RMPలు సహా 10 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు. ములుగు రోడ్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో 100కుపైగా అబార్షన్లు జగాయని, లింగ నిర్థారణ పరీక్షలు చేసినట్టు పోలీసులు అధికారులు గుర్తించారు. సీపీ రంగనాథ్ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ చేపట్టారు.
