AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

శర్వానంద్కు రోడ్డు ప్రమాదం

హైదరాబాద్: నటుడు శర్వానంద్‌కు రోడ్డు ప్రమాదం జరిగింది. ఫిల్మ్‌నగర్‌లో శర్వానంద్ కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో శర్వానంద్ బయటపడ్డాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. శర్వానంద్‌కు ఈ మధ్యనే తన ప్రియురాలు రక్షిత రెడ్డితో ఎంగేజ్మెంట్ జరిగింది. త్వరలో ఈ జంట పెళ్లి చేసుకోనుంది. ఈ యాక్సిడెంట్‌తో ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

ANN TOP 10