ఆంధ్రప్రదేశ్‌లో నేడు (గురువారం) పలు చోట్ల ఓ మోస్తరు నుంచి పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల సంస్థ వెల్లడించింది. ద్రోణి ప్రభావంతో ఈ రోజు అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, ఉభయగోదావరి, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ప్రజలు, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల సంస్థ సూచించింది. పిడుగులు పడే అవకాశం ఉంది కాబట్టి చెట్ల కింద ఉండరాదని తెలిపింది.
