కేసీఆర్ సంతాపం
హైదరాబాద్: బిఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి మాతృమూర్తి పద్మమ్మ శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. వృద్ధాప్యంలో పాటు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆమె సొంత గ్రామంలో ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడులో తుదిశ్వాస విడిచారు. బిఆర్‌ఎస్ కార్యకర్తలు, మంచి రెడ్డి కిషన్ రెడ్డి అభిమానులు ఇంటికి చేరుకొని సంతాపం తెలిపడంతో ఆమె పవిత్ర ఆత్మకు శాంత చేకూరలని భగవంతుడిని వేడుకున్నారు. ఎమ్మెల్యే కిషన్ రెడ్డి మృతృమూర్తి మరణం పట్ల సిఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. మంచి రెడ్డి కుటుంబానికి కేసీఆర్ సానుభూతి తెలిపారు.









