AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

డికె శివ కుమార్ ముందంజ….

కర్నాటక అసెంబ్లీ ఎన్నిలకల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కనకపూర్‌లో డికె శివ కుమార్ ముందంజలో ఉన్నారు. డికె ఆరు వేల ఓట్లకుపై ఆధిక్యంలో ఉన్నారు. షిగ్గావ్‌లో బస్వరాజు బొమ్మై, వరుణలో సిద్ధరామయ్యలు ముందంజలో ఉన్నారు. రామనగర్‌లో నిఖిల్ కుమారస్వామి, చెన్నపట్టణంలో కుమారస్వామి వెనుకంజలో ఉన్నారు.

కర్ణాటకలో గెలవాల్సిందే.. సీఎం సీటుపై కూర్చోవాల్సిందే అన్నట్లుగా మొదట్నుంచీ డీకే శివకుమార్ అహర్నిశలు కష్టపడుతూ వస్తున్నారు. రెండు, మూడు గంటల్లో పార్టీల భవితవ్యం తేలిపోనుండటంతో డీకే అలర్ట్ అయ్యారు. గెలిచిన ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరూ చేజారిపోకుండా ఉండటానికి.. గెలిచినట్లు తెలియగానే ఇక్కడ్నుంచి హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించేయాలన్నది డీకే ప్లాన్. భాగ్యనగరానికి తరలించిన తర్వాత అన్నీ రేవంత్‌ రెడ్డి దగ్గరుండి చూసుకోవాలని హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఈ క్రమంలో ఎప్పటికప్పుడు రేవంత్‌తో డీకే టచ్‌లో ఉంటూ మంతనాలు జరుపుతున్నారు. వాస్తవానికి ఇలా ఎన్నికల టైమ్‌లో హైదరాబాద్‌కు కర్ణాటక, మహారాష్ట్ర ఎమ్మెల్యేలలను తరలించడం కొత్త విషయమేమీ కాదు కానీ.. ఈ ఫలితాల తర్వాత దేశంలో సీన్ మొత్తం మారిపోతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ANN TOP 10