కన్నడనాట పోలింగ్‌లో పెళ్లి పీటల మీద నుంచి వచ్చి ఓటు వేస్తున్న దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. మైసూరులోని ఓ పోలింగ్ బూత్‌లో పెళ్లికూతురు, పెళ్లికొడుకు తమ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరి ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెళ్లి జరుగుతున్నప్పటికీ బాధ్యతాయుతంగా వచ్చి ఓటు వేయడంపట్ల వారికి అభినందనలు వెల్లువెత్తున్నాయి.
