హైదరాబాద్ మక్కా మసీద్‌లో ప్రత్యేక ప్రార్థనలకు నగర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మక్కా మసీదు, చార్మినార్ దగ్గర పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. రంజాన్ సందర్భంగా సామూహిక ప్రార్థనలకు భద్రతా చర్యలను సిద్ధం చేశారు. చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. మిరాలం ఈద్గా వెళ్లే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. మిరాలం ఈద్గా దగ్గర కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.









