పొలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV-C50) ప్రయోగానికి కౌంట్ డౌన్ కొనసాగుతుంది. మధ్యాహ్నం 2:20 గంటలకు నింగిలోకి పంపేందుకు శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు.రాకెట్‌లో సాంకేతిక లోపాలను శాస్త్రవేత్తల బృందం పరిశీలిస్తుంది. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి PSLV-C50 నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగానికి నిన్న మధ్యాహ్నం 12.50 గంటలకు కౌండ్ డౌన్ ప్రారంభమైంది.ఇది నిరంతరాయంగా 25.30 గంటల పాటు కొనసాగిన తర్వాత పీఎస్‌ఎల్‌వీ వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది.సింగపూర్‌కు చెందిన టెలియోస్-2 శాటిలైట్‌తో పాటు 16 కిలోల మరో శాటిలైట్‌ను ఈ రాకెట్ నింగిలోకి మోసుకెళ్లనుంది.









