బీఆర్ఎస్కు ఈటల సవాల్
సింగరేణి (Singareni) ప్రైవేటీకరణపై తనతో చర్చకు రావాలని బీఆర్ఎస్‌కు (BRS) బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. సింగరేణి లాభాల్లో ఉంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు ఎందుకు బిడ్ చేయలేదో కేసీఆర్ (CM KCR) చెప్పాలని డిమాండ్ చేశారు. ఎక్కడో ఉన్న వైజాగ్ స్టీల్ ఫ్లాంట్‌ను కాదు.. పేదలకు అండగా ఉండే తెలంగాణ ఆర్టీసీని (Telangana RTC) కాపాడాలని హితవుపలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుణ్యాన నాలుగు వేల ఆర్టీసీ బస్సులు ఖతం అయ్యాయని మండిపడ్డారు. వైజాగ్ స్టీల్ ఫ్లాంట్ సంగతి సరే.. తెలంగాణ చెరుకు రైతుల కోసం నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఎందుకు తెరవటం లేదని ఆయన నిలదీశారు.









