AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఢిల్లీ సాకేత్ కోర్టు ప్రాంగణంలో కాల్పుల కలకలం..

ఢిల్లీలోని సాకేత్ కోర్టు పరిసరాల్లో కాల్పులు కలకలం రేపాయి. లాయర్ దుస్తుల్లో వచ్చిన దుండగులు.. కోర్టు ఆవరణలోనే కాల్పులకు తెగబడ్డారు. దాదాపు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపి ఘటనా స్థలం నుంచి పరార్ అయ్యారు. ఈ కాల్పుల్లో ఓ మహిళతో పాటు లాయర్‌కు గాయాలవ్వగా.. ఇద్దరిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కోర్టు ప్రాంగణంలోని అడ్వకేట్స్ బ్లాక్ దగ్గర ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది.

ఓ మహిళను లక్ష్యంగా చేసుకుని దుండగులు కాల్పులు జరిపారు. ఆ కాల్పులతో కోర్టు ప్రాంగణంలోని అడ్వకేట్లు, ప్రజలు ఉలిక్కిపాటుకు గురయ్యారు. ఏం జరిగిందో తెలియక ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. కాల్పులతో కోర్టు పరిసరాల్లో ఒక్కసారిగా అలజడి రేగింది. అక్కడ ఉన్నవారందరూ భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో ఓ మహిళ కడుపులో నుంచి రక్తం కారుతుండగా.. ఆమె నొప్పితో కొట్టుమిట్టాడుతోంది. ఆమెను కొంతమంది ఆస్పత్రికి తరలిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది.

ANN TOP 10