AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

TSPSC పేపర్‌ లీకేజీ కేసులో మరో ఇద్దరు అరెస్ట్‌

TSPSC పేపర్‌ లీకేజీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మరో ఇద్దరు అరెస్ట్‌ అయ్యారు. మహబూబ్‌ నగర్‌ చెందిన మైసయ్య, జనార్దన్‌ లను సిట్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ప్రవీణ్‌, రాజశేఖర్‌, రేణుక ఆమె భర్త డాక్వా నాయక్‌ ఉన్నారు. రేణుక భర్త డాక్య దగ్గర ఏఈ ఏగ్జామ్‌ పేపర్‌ ను కొడుకు జనార్దన్‌ కోసం మైసయ్య రెండు లక్షల రూపాయలను ఇచ్చి కొన్నాడు. తండ్రి, కొడుకులను అరెస్ట్‌ చేసిన అధికారులు రిమాండ్‌ కు తరలించారు. కాగా ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 19 మంది అరెస్ట్‌ అయ్యారు. .450 మందిని విచారించారు. మరోవైపు TSPSC పేపర్‌ లీకేజీ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఇప్పటికే సిట్‌ నుంచి వివరాలు అందించాలని కోర్టును ఆశ్రయించిన ఈడీ..తాజాగా నిందితులను కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో పిల్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ప్రధాన నిందితులైన ప్రవీణ్‌, రాజశేఖర్‌ లను కస్టడీకి ఇస్తూ అనుమతి ఇచ్చింది. అయితే వారిని చంచల్‌ గూడ జైల్లోనే విచారించాలని కోర్టు సూచించగా అక్కడే అధికారులు విచారించారు. ఈ విచారణలో కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది.

ANN TOP 10