AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అలాంటి ఘటనలు మామూలే..

కడుపులో క్లాత్ మరిచిన ఘటనపై ఎమ్మెల్యే వింత సమాధానం..
జగిత్యాల జిల్లా ప్రభుత్వాస్పత్రిలో ఓ మహిళకు ఆపరేష్ చేసి కడుపులో క్లాత్ మరిచిన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ (BRS MLA Sanjay Kumar) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. శుక్రవారం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి పేషెంట్ల తాకిడి పెరిగిందని.. అందుకే ఒకటి, రెండు ఘటనలు ఎక్కువ అవుతున్నాయని చెప్పుకొచ్చారు. అంతమాత్రాన భయపడొద్దన్నారు. ఆస్పత్రుల్లో చనిపోతే ఆసుపత్రికి వెళ్ళటం మానేస్తామా అంటూ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వింత సమాధానం చెప్పారు. అయితే ఎమ్మెల్యే వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ANN TOP 10