ఐపీఎల్-2023లో భాగంగా మొహాలీ వేదికగా ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటలకు పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సిబి కెప్టెన్‌గా విరాట్ కోహ్లి తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. ధావన్ అందుబాటులో లేకపోవడంతో సామ్ కర్రన్ పంజాబ్ కింగ్స్ కెప్టెన్ బాధ్యతలు స్వీకరించాడు.
తుది జట్లు..
పంజాబ్ కింగ్స్: అథర్వ టైడే, మాథ్యూ షార్ట్, లివింగ్‌స్టోన్, హర్ప్రీత్ సింగ్, సికందర్ రజా, సామ్ కర్రన్ (కెప్టెన్), జితేశ్ శర్మ, షారుఖ్ ఖాన్, హర్ప్రీత్ బ్రార్, నాథన్ ఇల్లీస్, రాహుల్ చాహర్, అర్షదీప్ సింగ్
ఆర్సీబీ: డుప్లెసిస్, విరాట్ కోహ్లి (కెప్టెన్), మహిపాల్ లోమ్రార్, మ్యాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్, హర్షల్ పటేల్, హసరంగ, పార్నెల్, సుయాష్ ప్రభుదేశారు, సిరాజ్









