కర్నాటక ఎన్నికల నేపథ్యంలో బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంపై సందిగ్ధత కొనసాగుతోంది. ఈ విషయంలో బీజేపీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. తెలుగువారు అధికంగా ఉన్న ప్రాంతాల్లో బీజేపీ తరుఫున పవన్ ప్రచారం చేస్తారని బీజేపీ భావించింది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్‌తో ఇప్పటికే బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య రెండుసార్లు భేటీ అయ్యారు. అయితే కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ పాల్గొనేదానిపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. పొత్తులో ఉన్నారు కాబట్టి పవన్ ప్రచారానికి వస్తారని బీజేపీ నేతలు అంటున్నారు. కాగా పవన్ ఎన్నికల ప్రచారంపై జనసేన వర్గాలు మౌనంగా ఉన్నాయి.









