ఐపీఎల్ లో వరుస ఓటములతో నిరుత్సాహాన్ని ఎదుర్కుంటున్న ఢిల్లీ క్యాపిటల్స్ కు ఓ ఘటన ఛేధు అనుభవాన్ని మిగిల్చింది. చివరి మ్యాచ్ ఆడిన తర్వాత ఢిల్లీకి వెళ్లిన ఆటగాళ్లకు అనుకోని పరిణామం ఎదురైంది.
ఈ నెల 15న బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీతో తలపడి పరాభవం పాలైంది ఢిల్లీ క్యాపిటల్స్. మ్యాచ్ పూర్తయ్యాక బెంగళూరు నుండి ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీకి చేరుకున్న అనంతరం లగేజీ బ్యాగులు చూడగా.. కొన్ని ఆట పరికరాలు కనిపించకుండా పోయిన విషయం గుర్తించారు. కొందరి బ్యాట్లు, ప్యాడ్లు, ఇతర కిట్లు మాయమయ్యాయి. అయితే దీనిపై టీం క్యాప్టెన్ నుండి ఎలాంటి ప్రకటన రాలేదు. పోయిన వాటిల్లో కెప్టెన్ డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ బ్యాట్లు కూడా ఉన్నాయి.కొందరు ఆటగాళ్ల షూస్, గ్లోవ్ లు కూడా చోరీకి గురయ్యాయి. చోరీకి గురైన వాటి విలువ రూ.16 లక్షలు ఉంటుందని అంచనా.









