AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాహుల్ నిర్ణయం చారిత్రాత్మకం: వీహెచ్

బీసీల డిమాండ్లను మోదీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీహెచ్ అన్నారు. బీసీ క్రిమిలేయర్ ఎత్తేయాలని ఎన్నిసార్లు అడిగినా స్పందించడం లేదని తెలిపారు. గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తాము అధికారంలోకి రాగానే బీసీ జనగణన జరుపుతామని .. రిజర్వేషన్స్ పెంచుతామని రాహుల్ గాంధీ చెప్పడాన్ని స్వాగతించారు. రాహుల్ గాంధీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని గ్రామ గ్రామానికి తీసుకెళ్లాలని.. గాంధీ కుటుంబం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని తెలిపారు.మాట ఇచ్చి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని గుర్తు చేశారు.మోదీ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని తెలిపారు.

ఈనెల 25న బీసీ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని.. రాహుల్ ఇచ్చిన ఈ హమీపై అందరం ఆయనకు ధన్యవాదాలు చెప్పాలని అన్నారు. గతంలో వరంగల్ లో బీసీ గర్జన సభ పెట్టిన తరువాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, బీసీలను పార్టీకి దగ్గర చేసుకునే ఎజెండా తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.

ANN TOP 10