AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

టాలీవుడ్ ప్రముఖులకు ఐటీ ఝళక్

టాలీవుడ్ ప్రముఖులకు ఐటీ ఝళక్ ఇచ్చింది. పన్ను ఎగవేత ఆరోపణలతో రంగంలోకి దిగిన ఇన్ కం టాక్స్ అధికారులు.. ప్రముఖ డైరెక్టర్, నిర్మాణ సంస్థలో సోదాలు చేస్తున్నారు. పుష్ప సినిమా దర్శకుడు సుకుమార్‌ ఇంట్లో ఐటీ దాడులు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు. జీఎస్టీ సరిగా కట్టలేదనే ఆరోపణలతో.. సుకుమార్ ఇంట్లో రైడ్స్ చేస్తున్నారు. మరోవైపు మైత్రి మూవీ మేకర్స్ ఆఫీసులోను ఐటీ సోదాలు చేస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ దాదాపు రూ.700 కోట్ల వరకు వివిధ రూపాల్లో నగదు సమకూర్చుకుని జీఎస్టీ సరిగా కట్టలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ తరుణంలోనే మైత్రి మూవీ మేకర్స్ ఆఫీసులో ఈడీ సోదాలు చేస్తోంది. బంజారాహిల్స్, మాదాపూర్,జూబ్లీహిల్స్‌లో ఐటీ తనిఖీలు చేస్తుంది. సంస్థ డైరెక్టర్లు నవీన్, రవిశంకర్ ఇళ్లలోనూ ఐటీ తనిఖీలు చేస్తుంది. ఐటీ రైడ్స్ తో పుష్ప షూటింగ్ రద్దైంది.

ANN TOP 10