AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఫౌజీకి పోటీగా నాగ చైతన్య ‘వృషకర్మ’ ..!

అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య(Nagachaitanya) ప్రస్తుతం విరూపాక్ష ఫేమ్ డైరెక్టర్ కార్తీక్ దండు(Karthik Dandu) దర్శకత్వంలో వృషకర్మ(Vrushakarma) అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మైథలాజికల్, సూపర్ నేచురల్, ఫాంటసీ మరియు పీరియడ్ యాక్షన్ అడ్వెంచర్ నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.. నిజానికి ఈ సినిమాని దసరా పండుగ సందర్భంగా విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర నిర్మాతలు ఉన్నప్పటికీ కొన్ని కారణాలవల్ల మరింత ఆలస్యంగా విడుదలవుతుంది.

వృషకర్మ సినిమా విడుదలకు సంబంధించి గత కొద్దిరోజులుగా ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలు అన్నింటికి చెక్ పెడుతూ ఈ సినిమా నిర్మాణ సంస్థ విడుదల తేదీని ప్రకటించారు. వృషకర్మ సినిమా డిసెంబర్ 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని చిత్ర నిర్మాతలు తెలియజేశారు. ఇలా ఈ సినిమా డిసెంబర్లో విడుదల కాబోతుంది అనే విషయం తెలియడంతో చైతన్య అభిమానులు సంతోషం వ్యక్తం చేసినప్పటికీ ప్రభాస్ అభిమానులు మాత్రం నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ (Prabhas)నటించిన ఫాజీ(Fauzi) సినిమా డిసెంబర్ 3వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు.

ఇలా ఈ సినిమా విడుదల వాయిదా పడుతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నప్పటికీ చిత్ర నిర్మాతలు మాత్రం ఎక్కడా స్పందించలేదు. అయితే ఇప్పుడు వృషకర్మ సినిమా విడుదల తేదీ ప్రకటించడంతో కచ్చితంగా ప్రభాస్ ఫౌజీ సినిమా వాయిదా పడిందని స్పష్టమవుతుంది. ఒకవేళ ప్రభాస్ సినిమా యధావిధిగా విడుదల అయితే ప్రభాస్ సినిమాతో పోటీగా నాగచైతన్య వృష కర్మ సినిమా విడుదల చేసే సాహసం నిర్మాతలు చేయలేరు. ఫౌజీ వాయిదా పడటంతోనే అదే తేదీన నాగచైతన్య సినిమా విడుదలకు సిద్ధమవుతుందని తెలుస్తుంది.

ANN TOP 10