AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

డీఎస్సీపై వైసీపీ నిరసన ర్యాలీలు..! ముందస్తుగా కీలక నేతలు అరెస్ట్..

డీఎస్సీ‌లో అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబు సర్కార్‌పై ఒత్తిడి తేవాలని వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోందా? దాని పేరుతో నిరసనలు.. ర్యాలీలతో ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని భావిస్తోందా? ఈ ఇష్యూ ద్వారా జెన్ జీలను తన వైపు తిప్పుకునేందుకు ప్లాన్ చేసిందా? డీఎస్సీ వ్యవహారంపై కోర్టు కూడా సీబీఐ విచారణకు ససేమిరా చెప్పినా, ఎందుకు రాద్ధాంతం చేస్తోంది? సోమవారం నిరసన ర్యాలీలో కీలక నేతలు అరెస్టుతో పెద్దగా స్పందన లేదా?

ఏపీలో కూటమి ప్రభుత్వం గతేడాది డీఎస్సీ నిర్వహించింది. అందులో అక్రమాలు జరిగాయంటూ నిరసనలకు దిగుతోంది. వారానికి ఒక్కో పేరుతో నిరసనలు తీవ్రతరం చేస్తోంది వైసీపీ. ర్యాలీలు, నిరసనలు, శాంతియుత ప్రదర్శనలు మొదలు పెట్టింది. ఈ విషయంలో న్యాయస్థానాలను సైతం ఆశ్రయించింది. అక్కడా వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. పరిస్థితి గమనించిన ఆ పార్టీ హైకమాండ్..  నేరుగా ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యింది. అసలే జెన్ జీ ఉద్యమాలు తీవ్రమవుతున్న నేపథ్యంలో తాము చేస్తున్న ర్యాలీలు సక్సెస్ అవుతాయని భావించింది వైసీపీ.

సోమవారం ఏపీ వ్యాప్తంగా ర్యాలీలకు పిలుపు ఇచ్చింది వైసీపీ. ప్లాన్ ప్రకారం నేతలంతా రోడ్డెక్కాలని భావించారు. కీలక నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి ర్యాలీలు చేపట్టారు. పెద్దగా స్పందన కనిపించలేదు. కీలక నేతలు అరెస్టుతో ర్యాలీలకు ఊపు పోయింది. ప్రజలకు అవాంతరాలు కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని తేల్చిచెబుతున్నారు పోలీసులు. ర్యాలీలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ర్యాలీ అనుమతి లేదంటూ ఆయా నేతలకు నోటీసులు ఇచ్చారు.

మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పలువురు నోరు విప్పారు. యువగళంలో లోకేష్ వెంట నడిచిన వారికి స్పోర్ట్స్ కోటా పేరుతో ఉద్యోగాలు ఇచ్చారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. సీబీఐతో విచారణ చేయిస్తే వాస్తవాలు బయటకు వస్తాయని ప్రభుత్వం భయపడుతోందని ఆరోపించారు. గాంధేయ పద్దతి నిరసనలు చేస్తున్న తమను అడ్డుకోవడం సరికాదన్నారు. డీఎస్సీలో అక్రమాలపై సీబీఐ చేత విచారణ చేయించాలని మాజీ మంత్రి కన్నబాబు డిమాండ్ చేశారు. దీనికి బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలన్నారు. విద్యార్థులు ఫీజు రీయంబర్స్మెంట్ నిరుద్యోగ భృతి చెల్లించాలని కోరారు.

ANN TOP 10