AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జీవో 97తో పాలిటెక్నిక్ విద్యార్థులకు ముప్పు..? టీఆర్‌ఎస్ సంచలన నివేదిక..!

జీవో 97అంశంపై సమగ్ర సమీక్ష పూర్తయ్యే వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలంగాణ రక్షణ సేన కోరింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో 97 కారణంగా పాలిటెక్నిక్ విద్యార్థులకు, విద్యావ్యవస్థకు జరిగే నష్టాలపై అధ్యయనం కోసం తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత నియమించిన అధ్యయన కమిటీ తన రిపోర్ట్ ను కమిటీ చైర్మన్ కె.కేశవరావుకు శనివారం అందజేసింది. దాదాపు 10 రోజులు పాటు కమిటీ సభ్యులు ఈ అంశంపై అధ్యయనం చేసి నివేదిక తయారు చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థులతో పాటు విద్యారంగ ప్రముఖులతో మాట్లాడారు.

ప్రభుత్వం ఇచ్చిన జీవో కారణంగా వచ్చే నష్టాలను నివేదికలో పొందుపరిచారు. ఈ జీవో పై సమగ్ర సమీక్ష పూర్తయ్యే వరకు తదుపరి చర్యలను నిలిపివేయాలని టీఆర్ఎస్ కోరింది. అప్పటివరకు ప్రస్తుతం ఉన్న సాంకేతిక విద్యా విధానం, ఎస్బీటెట్ వ్యవస్థ పరిధిలోనే పాలిటెక్నిక్ విద్యను కొనసాగించాలన్నారు. ప్రస్తుతం ఉన్న డిప్లొమా అర్హతల గుర్తింపును, అలాగే ఈ-సెట్, లాటరల్ ఎంట్రీతో సహా ఉన్నత విద్య కోసం ఉన్న అన్ని మార్గాలను రక్షిస్తామనిలిఖితపూర్వక హామీ ఇవ్వాలని, పాలిటెక్నిక్ విద్య సామాన్యులకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.

విద్యార్థుల ఫీజులను ఇష్టానుసారంగా పెంచొద్దని, ప్రస్తుతం అమల్లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యార్థులకు ఇచ్చే ప్రయోజనాలు యథాతథంగా కొనసాగించాలని, పాలిటెక్నిక్ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి వారి క్యాడర్, ప్రమోషన్లు, సర్వీస్ నిబంధనలకు అనుగుణంగా ఉద్యోగ భద్రత ఇవ్వాలి (ప్రమోషన్లు),ఉద్యోగ భద్రతతో సహా పూర్తి సేవా రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ భూములు, భవనాలు, (లాబ్స్) తో సహా ఇతర ఆస్తులకు సంబంధించి చట్టపరమైన అనుమతులు లేకుండా వాణిజ్య, ప్రైవేట్ ప్రయోజనాల కోసం మళ్లించొద్దన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు నరేశ్, ధరణి రాణి, సురభి, వెంకటేశ్వర్ రావు, ఉదరి చంద్రమోహన్ గౌడ్, కోట్ల మహేందర్ రెడ్డిఉన్నారు.

ANN TOP 10