AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

యూపీలో షాకింగ్ ఘటన..! భార్య ప్రైవేట్ పార్ట్స్ కొరికితే.. భర్త ముక్కు కొరికేశాడు..!

భార్యాభర్తల మధ్య ఆవేశాలు, కోపాలు తారాస్థాయికి చేరాయి. ఫలితంగా ఒకరిపై మరొకరు పడి కొరుక్కునే విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. యూపీలో వెలుగులోకి వచ్చిన దీని వెనుక అసలు ఏం జరిగింది? ప్రస్తుతం భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అసలు ఏం జరిగింది?

ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయి జిల్లా కేంద్రంలో వెలుగు చూసిన విచిత్రమైన ఘటన వివరాల్లోకి వెళ్తాం. 27 ఏళ్లు సాధన- భర్త దీపక్ భార్యాభర్తలు. పెళ్లై సుమారు 10 సంవత్సరాలు అవుతోంది. ఎనిమిది, ఆరు, మూడు సంవత్సరాల వయస్సు గల ముగ్గురు పిల్లలు ఉన్నారు. తాపీగా సాగుతున్న వీరి సంసారంలోకి కొత్త వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. ఆనాడు భార్యభర్తల మధ్య చిన్నపాటి గొడవలు పెరుగుతూ వచ్చాయి. శనివారం నాటికి అవి కాస్త తారాస్థాయికి చేరాయి.

సీన్ కట్ చేస్తే.. సాధన, దీపక్ ఫ్రెండ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. రెండున్నర నెలల కిందట అతడితో వెళ్లిపోయింది. ఇంతవరకు బాగానే జరిగింది. తన పిల్లల్ని తీసుకెళ్లడం కోసం సెప్టెంబర్ 17న దొంగచాటుగా పొరుగింటి పైకప్పు మీదుగా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడి నుంచి భార్యభర్తల మధ్య అసలు కథ మొదలైంది. సాధన తిరిగి రావడం దంపతుల మధ్య వాగ్వాదానికి దారితీసింది. దీపక్ తన తలపై దాడి చేసి, తన ముక్కును కొరికి కాలువలో పడేశాడన్నది భార్య సాధన ప్రధాన ఆరోపణ. తనపై భర్త దాడి చేసిన సమయంలో అత్తమామలు తన చేతులు గట్టిగా పట్టుకున్నారని ఆరోపించింది.

ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరుపక్షాలను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. తొలుత సాధనను కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లి చికిత్స చేయించాయి. అక్కడి నుంచి తదుపరి చికిత్స కోసం హర్దోయ్ మెడికల్ కాలేజీకి తరలించారు. ఈ విషయాన్ని పోలీసులు చెప్పారు. ఇక భర్త దీపక్ విషయానికి వద్దాం. సాధన అనుకోకుండా తిరిగి వచ్చి పిల్లలను తనతో తీసుకెళ్లడానికి ప్రయత్నించిందని ఆరోపించాడు భర్త దీపక్.

జరిగిన గొడవలో సాధన తన భర్త ప్రైవేటు పార్ట్స్ కొరికిందని పేర్కొన్నాడు. ఆ తర్వాత నేలపై తల బాదుకుని గాయపడిందని ఆరోపించింది. సాధన ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. దీపక్ తల్లి ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. ఈ కేసులోని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. ఆ తర్వాత ఆమె భర్త దీపక్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

ANN TOP 10